అయోధ్య రామజన్మభూమిలో కరోనా కలకలం... పూజారికి పాజిటివ్
- పూజారి ప్రదీప్ దాస్ కు కరోనా
- మరో 16 మంది భద్రతా సిబ్బందికి కూడా పాజిటివ్
- ఆగస్టు మొదటి వారంలో భూమి పూజ
ఆగస్టు 5న రామ మందిరానికి భూమి పూజ జరగనుండగా, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు రానున్న వేళ పూజారికే కరోనా సోకడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది వరకు వీఐపీలు రానున్నట్టు తెలుస్తోంది. పూజారికి కరోనా సోకిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది.