ISI: అయోధ్య రామ జన్మభూమిపై దాడులకు ఐసిస్ ప్లాన్ చేస్తోంది: ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక

ISI plotting terrorist attack in Ayodhyas Ram Janmabhoomi on August 15
షార్ట్స్‌లో చూడండి
అయోధ్య రామ జన్మభూమిపై ఆగస్టు 15వ తేదీన దాడులకు ఉగ్రసంస్థ ఐసిస్ ప్లాన్ చేస్తోందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'రా' వర్గాలు తెలిపాయి. ఈ దాడుల కోసం లష్కర్, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్థాన్ లో ఐసిస్ ట్రైనింగ్ ఇచ్చిందని సమాచారం. ఐసిస్ ద్వారా శిక్షణ పొందిన ఉగ్రవాదులను మూడు లేదా ఐదు బృందాలుగా భారత్ లోకి పాక్ పంపించబోతోందని చెప్పింది. ఈ బృందాలు ఒక ప్రత్యేకమైన రీతిలో దాడులు చేసేలా పాకిస్థాన్ ప్లాన్ చేస్తోందని... భారత్ లో అంతర్గతంగా దాడులు జరిగాయనే విధంగా ఆ దాడులు ఉండేలా స్కెచ్ వేసిందని తెలిపింది. ఈ దాడుల్లో ముఖ్యంగా వీవీఐపీలను టార్గెట్ చేస్తున్నారని హెచ్చరించింది.
Go Back to Shorts
ISI
Raw
Terrorist
Ayodhya

More Telugu News