Somu Veerraju: ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు... కన్నా స్థానంలో సోము వీర్రాజుకు బాధ్యతలు!

Somu Veerraju appointed as new president for AP BJP
  • ఏపీ బీజేపీ ప్రెసిడెంటుగా సోము వీర్రాజు
  • ఖరారు చేసిన జేపీ నడ్డా
  • ఇప్పటివరకు ఏపీ బీజేపీ చీఫ్ గా కన్నా
ఏపీ బీజేపీ విభాగానికి కొత్త అధ్యక్షుడు వచ్చారు. సోము వీర్రాజు నూతన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా ఖరారు చేశారు. ఇప్పటిరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు బాధ్యతలు అందుకోనున్నారు. కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలే కన్నా స్థానంలో సోము వీర్రాజు నియామకానికి కారణమని తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
Somu Veerraju
BJP
President
Andhra Pradesh
Kannababu
JP Nadda

More Telugu News