సోనియా, రాహుల్ ఆస్తులపై విచారణకు ఆదేశం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోనియా, రాహుల్ ఆస్తులపై విచారణకు ఆదేశం!

Enquiry on Sonia and Rahul Assests
  • ఉత్తర్వులు జారీ చేసిన హర్యానా ప్రధాన కార్యదర్శి
  • కక్ష సాధింపు చర్యలకు బీజేపీ దిగుతోందన్న కాంగ్రెస్
  • నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామన్న బీజేపీ
హర్యానాలో ఉన్న గాంధీ - నెహ్రూ కుటుంబీకుల ఆస్తులపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హర్యానా ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి కేష్మీ ఆనంద్ అరోరా ఈ ఉదయం నగర పరిపాలనా సంస్థల శాఖను కోరారు.

కాగా, రాష్ట్రంలోని సోనియా, రాహుల్ గాంధీల ఆస్తులపై గతంలో ప్రారంభమైన విచారణ కొనసాగుతుందని, గురుగ్రామ్ లో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు కేటాయించిన ఫ్లాట్ పై ఆరా తీస్తున్నామని అధికారులు వెల్లడించారు. గాంధీలు నిర్వహించే ట్రస్ట్ లకు వచ్చిన విదేశీ విరాళాలపై కేంద్రం ఇప్పటికే విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

రాజీవ్ గాంధీ ఫౌండేషన్ తో పాటు, రాజీవ్ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ లపై విచారణకు కేంద్రం ఇప్పటికే ఓ కమిటీని సైతం నియమించింది. బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, ఈ విషయంలో తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని ఎన్డీయే నేతలు అంటున్నారు. హర్యానాలో కాంగ్రెస్ కారు చౌకగా అసోసియేటెడ్ జర్నల్స్ కు కట్టబెట్టిన ప్లాట్ ను ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. 23 ఏళ్ల నాటి ధరల ఆధారంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నది ఈడీ ఆరోపణ.
Sonia Gandhi
Gandhis
Rahul Gandhi
Assests
Enquiry

More Telugu News