Sonu Sood: చిత్తూరు జిల్లాలో పొలం దున్నిన అక్కాచెల్లెళ్ల కుటుంబానికి ట్రాక్టర్ పంపిస్తున్న సోనూ సూద్

  • అక్కాచెల్లెళ్లు పొలం దున్నుతున్న వీడియో వైరల్
  • వెంటనే స్పందించిన సోనూ సూద్
  • సాయంత్రానికి ఓ ట్రాక్టర్ మీ పొలం దున్నుతూ ఉంటుందని ట్వీట్
Sonu Sood sends a tractor for Chittoor district farmer family

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ రైతు కాడెద్దులతో, ట్రాక్టర్ తో పొలం దున్నించుకునేందుకు డబ్బులేక తన ఇద్దరు కుమార్తెల సాయంతో పొలం దున్నడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. లాక్ డౌన్ పరిస్థితుల్లో చితికిపోయిన ఓ టమోటా రైతు దయనీయ స్థితికి ఈ వీడియో అద్దం పట్టింది.

అయితే, ఈ వీడియోను చూడాల్సిన వాళ్లే చూశారు! ఇప్పటికే వేలాదిమంది వలసజీవులకు ఎంతో ఉపకారం చేసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఈ అక్కాచెల్లెళ్ల కష్టాన్ని చూసి చలించిపోయారు. వారికి ఓ ట్రాక్టర్ కొనివ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు. తొలుత వారికి ఓ జత ఎద్దులు కొనివ్వాలని నిర్ణయించుకున్నా, ఆపై మనసు మార్చుకుని సోనాలికా ట్రాక్టర్ అందించాలని నిశ్చయించుకున్నారు. సాయంత్రానికల్లా ఓ ట్రాక్టర్ మీ పొలాన్ని దున్నుతూ ఉంటుంది అంటూ సోనూ సూద్ ట్వీట్ చేశారు.


More Telugu News