Telangana: తెలంగాణలో మరో 1,593 మందికి కరోనా.. జీహెచ్‌ఎంసీలో పెరుగుతోన్న కేసులు

coronavirus cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కొవిడ్‌-19 కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం నిన్న బులెటిన్ వెల్లడించలేదు. నిన్నటి వివరాలను ఈ రోజు వెల్లడించింది. 24 గంటల్లో 15,654 మంది నమూనాలను పరీక్షించగా, వారిలో 1,593 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 641 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 54,059 అని పేర్కొంది.  ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 12,264  మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 5,245 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 463కి చేరింది.    

తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించి పూర్తి వివరాలు..
                                               
                       
Go Back to Shorts
Telangana
Corona Virus
COVID-19

More Telugu News