Corona Virus: ఏపీలో ఎక్కువవుతున్న కరోనా కేసులు... మరో 52 మంది మృతి

Corona cases floods AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. ఇవాళ కూడా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 7,813 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఉభయగోదావరి జిల్లాల్లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో 1,324, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,012 కేసులు గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 88,671కి చేరింది.

మరణాలు కూడా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 52 మంది మృత్యువాత పడ్డారు. దాంతో కరోనా మృతుల సంఖ్య 985కి పెరిగింది. తాజాగా, కరోనా నుంచి కోలుకున్న 3,208 మందిని డిశ్చార్జి చేశారు. ఇంకా 44,431 మంది ఆసుపత్రుల్లో, క్వారంటైన్ కేంద్రాల్లో, హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Positive
Deaths

More Telugu News