హైదరాబాద్‌లో కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న బాబా అరెస్టు
- సమస్యలు తీర్చుతానంటూ తాయత్తులు కట్టే బాబా
- కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొత్త బిజినెస్
- భక్తుల నుంచి రూ.12 వేలు చొప్పున వసూలు
- అరెస్టు చేసిన పోలీసులు
కరోనా రాకుండా చేస్తానని వారిని నమ్మించాడు. కరోనాకు మందు ఇస్తానంటూ రూ.12 వేల చొప్పున భక్తుల నుంచి వసూలు చేశాడు. అయితే, అతడు డబ్బులు తీసుకున్నప్పటికీ కరోనాకు మందు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇస్మాయిల్ బాబాను హఫీజ్‌పేట్ హనీఫ్ కాలనీలో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.