హీరోయిన్ పేరు మీద పలావ్.. వైరల్ అవుతోన్న పిక్‌

24-07-2020 Fri 10:37
  • హీరోయిన్ అదితి రావు ఫొటోను పోస్ట్ చేసిన అభిమాని
  • రీట్వీట్ చేసిన అదితి
  • చంపేశావ్ కదా అంటూ కామెంట్
aditi rao pic goes viral

సమ్మోహనం, అంతరిక్షం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అదితి రావు సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటుంది. బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఓ ప్లేటులో పలావ్ వుండగా.. దాని మధ్యలో అదితిరావు ఫొటో వచ్చేలా దీనిని క్రియేట్ చేయడం జరిగింది.
                                      
ఈ ఫొటోను క్రియేట్‌ చేస్తూ దానికి 'అదితి పలావ్' అంటూ ఆ అభిమాని పేరు పెట్టాడు. గుహాన్ అనే తన అభిమాని పోస్ట్ చేసిన ఈ ఫొటోను అదితిరావ్ తన ట్విట్టర్ ఖాతాలో రీట్వీట్ చేసింది. 'చంపేశావు కదా!' అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వెబ్ సిరీస్‌లతోనూ బిజీగా ఉంది.