India: దేశంలో 30 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య

Highest singleday spike of 49310 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా అంతకంతకు పెరిగిపోతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... గత 24 గంటల్లో భారత్‌లో 49,310 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో ఇన్ని కరోనా కేసులు నిర్ధారణ కావడం ఇదే తొలిసారి. అదే సమయంలో 740 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 12,87,945కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 30,601కి పెరిగింది. 4,40,135 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 8,17,209 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,54,28,170 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,52,801 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
India
Corona Virus
COVID-19

More Telugu News