సచిన్ పైలట్ వర్గానికి ఊరట... హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- జూలై 24 వరకు పైలట్ వర్గంపై ఎలాంటి చర్యలు వద్దన్న హైకోర్టు
- దీనిపై సుప్రీంను ఆశ్రయించిన రాజస్థాన్ స్పీకర్
- సుదీర్ఘ విచారణ అవసరమన్న సుప్రీంకోర్టు
అయితే, స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్ లోని అంశాలపై సుదీర్ఘ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ కేసును ఈ నెల 27కి వాయిదా వేస్తున్నామని జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది. అంతకుముందు, స్పీకర్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ తమ వాదనలు వినిపిస్తూ, స్పీకర్ విచక్షణాధికారాల్లో హైకోర్టు జోక్యం చేసుకోజాలదని, హైకోర్టు ఆదేశాలు రాజ్యాంగ వ్యతిరేకమని తెలిపారు. అసమ్మతి సభ్యులపై స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే హైకోర్టు ఏ విధంగా జోక్యం చేసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యల ద్వారా అసమ్మతి గళాన్ని అణచివేయలేరని జస్టిస్ అరుణ్ మిశ్రా వ్యాఖ్యానించారు.