నయనతార-ప్రభుదేవా సహజీవనంపై సినీనటి వనిత వివాదాస్పద వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నయనతార-ప్రభుదేవా సహజీవనంపై సినీనటి వనిత వివాదాస్పద వ్యాఖ్యలు

vanita about nayan personal life
  • వనితా విజయకుమార్ మూడో పెళ్లిపై విమర్శలు
  • సమాధానం చెబుతూ వనిత ట్వీట్లు
  • ప్రభుదేవా విడాకులు ఇవ్వకుండానే సహజీవనం చేశాడని వ్యాఖ్య
  • మండిపడ్డ నయనతార ఫ్యాన్స్
సినీ నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు, సినీనటి, బిగ్‌ బాస్‌-3 ఫేమ్ వనితా విజయకుమార్ ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆమెపై పలువురి నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తోన్న విమర్శలకు ఆ మాధ్యమం ద్వారా సమాధానం చెబుతోన్న ఆమె.. సినీ నటి నయనతార వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రస్తావించింది.

డ్యాన్స్‌ మాస్టర్, సినీ దర్శకుడు, నటుడు ప్రభుదేవా కూడా గతంలో తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే నయన తారతో సహజీవనం చేశాడని ఆమె గుర్తు చేసింది. దీంతో ప్రభుదేవా భార్య రమాలతతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పింది. అప్పట్లో ఈ విషయంపై ఒక్క మాట మాట్లాడని వారు, తన మూడో పెళ్లి గురించి మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారని ఆమె ప్రశ్నించింది. దీంతో ఆమెపై నయనతార ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున మండిపడ్డారు. చివరకు వనిత తన ట్విటర్ ఖాతా నుంచి వైదొలిగింది.
vanita
nayanatara
prabhudeva

More Telugu News