మీ పాపం మీరు అనుభవించాల్సిందే.. నాకు సంతోషం లేదు: లాల్ దర్వాజ బోనాల్లో భవిష్యవాణి

20-07-2020 Mon 20:13
  • నాకు సంతోషం, శాతం లేవు 
  • పొలిమేరల్లో ఉన్న శక్తులకు పచ్చి మాంసంతో ఆరగింపులు ఇవ్వండి
  • అవి శాంతించి రోగాలను పొలిమేర దాటనివ్వవు
I am not satisfied says Bhavishyavani in Lal Darvaja Bonalu

మీరు చేసుకున్న పాపాల వల్లే రోగాలు ఒకదాని వెనుక మరొకటి వస్తున్నాయని లాల్ దర్వాజ బోనాల్లో కరోనాను ఉద్దేశించి భవిష్యవాణి తెలిపింది. ఎవరు చేసుకున్న తప్పులకు వారు శిక్షను అనుభవించాల్సిందేనని చెప్పింది. మీ తప్పులకు మీరే బాధ్యులని తెలిపింది. తనకు సంతోషం, శాంతం లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది.

 వచ్చిన రోగాన్ని తొలగించుకోవడం మీ చేతుల్లోనే ఉందని... మీ పొలిమేర చుట్టూ ఉన్న శక్తులకు శాంతి చేయండని సూచించింది. శక్తులు ఆరగింపులు కోరుతున్నాయని... వాటికి పచ్చి మాంసంతో ఆరగింపులు ఇవ్వాలని... అప్పుడు అవి శాంతించి రోగాలను పొలిమేర దాటనివ్వవని చెప్పింది. గత వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా భవిష్యవాణి మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది.