Bigg Boss: త్వరలో బిగ్ బాస్-4... అధికారికంగా ప్రకటించిన స్టార్ మా

All set for Bigg Boss four as Star Maa announced officially
  • ప్రోమో రిలీజ్ చేసిన స్టార్ మా
  • సందడి వచ్చేస్తోందంటూ ట్వీట్
  • అనుమానాలకు తెరదించిన స్టార్ మా
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్-4 త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా చానల్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ కార్యక్రమం ఉంటుందా, లేదా అన్నదానిపై సందేహాలు ఏర్పడ్డాయి. ఇప్పుడా అనుమానాలన్నింటికి తెరదించుతూ స్టార్ మా ప్రోమో విడుదల చేయడం ద్వారా అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే బిగ్ బాస్-4 అంటూ ప్రోమోలో వెల్లడించింది.

కాగా, కరోనా రక్కసి విజృంభిస్తుండడంతో వినోద రంగ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఏవో కొన్ని సినిమాల షూటింగ్ లు మళ్లీ మొదలైనా, మునుపటి కళ ఇంకా కనిపించడంలేదు. టీవీ సీరియళ్ల చిత్రీకరణ మొదలైనా పలువురు నటులు కరోనా బారినపడడంతో అక్కడ కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నాలుగో సీజన్ షురూ చేసేందుకు స్టార్ మా సిద్ధపడడం విశేషం అని చెప్పాలి.

Bigg Boss
BiggBoss-4
Star Maa
Promo
Andhra Pradesh
Telangana

More Telugu News