Jagga Reddy: సంగారెడ్డిలో హరీశ్ రావు వల్లే కరోనా.. మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Corona is spreading because of Harish Rao says Jagga Reddy
  • హరీశ్ రావు వచ్చినప్పుడల్లా వందల సంఖ్యలో జనాలు గుమికూడుతున్నారు
  • కరోనా వైరస్ విస్తరించడానికి కారణం ఇదే
  • మీ రాజకీయాల కోసం జనాలను చంపుతారా?
తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. సంగారెడ్డిలో కరోనా కేసులు పెరగడానికి హరీశ్ రావే కారణమని ఆరోపించారు. వివిధ కార్యక్రమాల కోసం హరీశ్ సంగారెడ్డికి వచ్చినప్పుడు ఆయన చుట్టూ వందల సంఖ్యలో జనాలు ఉంటున్నారని... వైరస్ వ్యాప్తికి ఇదే  కారణమని చెప్పారు. కరోనా సమయంలో ఇలాంటి రాజకీయాలు అవసరమా? అని విమర్శించారు. మీ రాజకీయాల కోసం జనాలను చంపుతారా? అని ప్రశ్నించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో తన ఇమేజ్ ని తగ్గించాలనుకుంటే... వెంటనే నియోజకవర్గానికి రూ. 2 వేల కోట్లను కేటాయింపజేయాలని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో తాను కూడా తిరగగలనని... అయితే, కరోనా సంక్షోభ సమయంలో అలా చేయడం సరికాదని చెప్పారు.
Jagga Reddy
Congress
Harish Rao
TRS
Sangareddy
Corona Virus

More Telugu News