రాణి అనే ఏనుగును దత్తత తీసుకున్న ఉపాసన

20-07-2020 Mon 18:40
  • హైదరాబాదు జూపార్కును సందర్శించిన ఉపాసన
  • జూ వర్గాలకు రూ.5 లక్షల చెక్ అందజేత
  • సామాజిక సేవా కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్న ఉపాసన
Upasana Konidela adopted an elephant from Hyderabad zoo

టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ అర్ధాంగి, అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ ఉపాసన కొణిదెల మరో సేవా కార్యక్రమానికి నాంది పలికారు. ఈ రోజు తన జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి రాణి అనే ఏనుగును దత్తత తీసుకున్నారు. ఇకపై రాణి బాగోగులను ఉపాసన చూసుకోనున్నారు. ఈ మేరకు ఆమె జూ అధికారులకు రూ.5 లక్షల చెక్ అందించారు. ఉపాసన అపోలో లైఫ్ తరఫున అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల శ్రీశైలం పరిసరాల్లో ఉండే చెంచు గిరిజనులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.