Pilli Subhas Chandra Bose: మోపిదేవి, సుభాష్ చంద్రబోస్ ల రాజీనామాలు ఆమోదించిన గవర్నర్

Governor approves resignations of Mopidevi and Pilli
  • రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి, సుభాష్ చంద్రబోస్
  • మంత్రి పదవులకు రాజీనామా
  • ఈ నెల 22న రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం
వైసీపీ నేతలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ మంత్రిపదవులకు రాజీనామాలు చేయగా, వారి రాజీనామాలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. మోపిదేవి, సుభాష్ చంద్రబోస్ ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నెగ్గడంతో వారు తమ మంత్రి పదవులు వదులుకున్నారు. ఈ నెల 22న వారిద్దరూ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేరోజున మోపిదేవి, సుభాష్ చంద్రబోస్ ల స్థానంలో ఇద్దరు కొత్త మంత్రులు రాష్ట్ర క్యాబినెట్ లో చేరనున్నారు. దీనిపై ప్రకటన వెలువడాల్సి ఉంది.
Pilli Subhas Chandra Bose
Mopidevi Venkataramana
Resignations
Governor
YSRCP
Andhra Pradesh
Rajya Sabha

More Telugu News