KCR: గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన సీఎం కేసీఆర్

KCR meets governor Tamilisai
  • రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్
  • గవర్నర్ తో పలు అంశాలపై చర్చ
  • నిన్న కేసీఆర్ తో మాట్లాడిన మోదీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో ముఖ్యమంత్రి  కేసీఆర్ భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్ ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఇరువురు చర్చించారు.

ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై చర్చ జరిగింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ టెస్టులు, పేషెంట్లకు అందిస్తున్న చికిత్స తదితర అంశాలపై గవర్నర్ కు కేసీఆర్ వివరించారు. దీంతో పాటు రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయం నిర్మాణం తదితర అంశాలపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. కేసీఆర్ కు ప్రధాని మోదీ నిన్న ఫోన్ చేసి కరోనా పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఇది జరిగిన మరుసటి రోజే గవర్నర్ ను కేసీఆర్ కలవడం గమనార్హం.
KCR
TRS
TS Governor
Tamilisai Soundararajan

More Telugu News