మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ బహిష్కరణ వేటు.. రాజస్థాన్‌లో రంజుగా రాజకీయం
- భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్రసింగ్‌ల ప్రాథమిక సభ్యత్వాల రద్దు
- కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే వేటు
- పైలట్ వెనక్కి వస్తే ఆహ్వానించేందుకు కాంగ్రెస్ సిద్ధం
మరోవైపు, పైలట్‌కు కాంగ్రెస్ ద్వారాలు ఇంకా తెరిచే ఉంచింది. పదవుల నుంచి తప్పిస్తూ తనకు ఇచ్చిన నోటీసులపై పైలట్ కోర్టుకెక్కినప్పటికీ, ఆయన వెనక్కి వస్తే తిరిగి అక్కున చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పైలట్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయొద్దంటూ ముఖ్యమంత్రి గెహ్లాట్‌కు అధిష్ఠానం సూచించినట్టు సమాచారం. కాగా, దక్షిణాదికి చెందిన ఓ నేతతో పైలట్ సంప్రదింపులు జరపగా, ప్రస్తుత పరిణామాలను మరిచిపోయి ఆహ్వానించేందుకు పార్టీ సిద్ధంగా ఉందని, పార్టీలో ఆయనకు మునుపటి గౌరవం ఉంటుందని ఆ నేత చెప్పినట్టు తెలిసింది.