బలాన్ని చూపించే ప్రయత్నం.. తన వర్గం ఎమ్మెల్యేతో వీడియో విడుదల చేసిన సచిన్ పైలట్
- రాజస్థాన్‌లో ఎడతెగని రాజకీయ సంక్షోభం
- నేడు మరోమారు సీఎల్పీ సమావేశం
- సచిన్ విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది 15 మంది ఎమ్మెల్యేలే
మరోవైపు, తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని, 109 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని నిన్న జరిగిన సీఎల్పీ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి గెహ్లాట్ వర్గం ప్రకటించింది. గెహ్లాట్ వర్గ ఎమ్మెల్యేలు జైపూర్ శివారులో ఉన్న రిసార్టులో మకాం వేశారు. నేడు మరోమారు ఇక్కడే సీఎల్పీ సమావేశం జరగనుంది. నిన్న జరిగిన సమావేశానికి డుమ్మా కొట్టిన పైలట్, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు నేడు కూడా హాజరు కావడం అనుమానంగానే ఉంది.