నేను కోలుకోవాలని ప్రార్థనలు చేయండి: బాలీవుడ్ నటి రాచెల్ వైట్

13-07-2020 Mon 16:45
  • బాలీవుడ్ పై పంజా విసురుతున్న కరోనా
  • ఇప్పటికే  కరోనా బారిన పడ్డ పలువురు సెలబ్రిటీలు
  • తనకు కరోనా పాజిటివ్ అని స్వయంగా ప్రకటించిన రాచెల్ వైట్
Actress Rachel White tests corona positive

మన దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ప్రతిరోజు 25 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు బాలీవుడ్ పై కరోనా పంజా విసిరింది. ఇప్పటికే పలువురు నటీనటులు, టెక్నీషియన్లు కరోనా బారిన పడ్డారు. బిగ్ బీ అమితాబ్ కుటుంబం కరోనా బారిన పడింది. తాజాగా మరో బాలీవుడ్ నటి రాచెల్ వైట్ కు కూడా మహమ్మారి సోకింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది.

ట్విట్టర్ ద్వారా రాచెల్ స్పందిస్తూ, తనకు కరోనా సోకిందని చెప్పింది. ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నానని తెలిపింది. ఈ వైరస్ నుంచి తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయాలని అభిమానులను కోరింది. రాచెల్ ట్వీట్ చూసిన అభిమానులు ఆమెలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ధైర్యంగా ఉండాలని, భయపడాల్సిన అవసరం లేదని చెపుతున్నారు.