ఫాంహౌస్ నుంచి ప్రగతి భవన్ కు చేరుకున్న కేసీఆర్

11-07-2020 Sat 17:10
  • రెండు వారాలుగా ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్
  • సీఎం ఎక్కడ? అంటూ సోషల్ మీడియాలో చర్చ
  • కాసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్న సీఎం
KCR reaches Pragathi Bhawan

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదులోని తన అధికారిక నివాసం ప్రగతి భవన్ కు చేరుకున్నారు. గత రెండు వారాలుగా ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో ఉన్నారు. కరోనా పరిస్థితులు, అభివృద్ధి పనులపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన రైతులతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

మరోవైపు ముఖ్యమంత్రి ఎక్కడ? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కనబడటం లేదనే వార్తలు హల్ చల్ చేశాయి. 'వేర్ ఈజ్ సీఎం' అంటూ ఇద్దరు యువకులు ఏకంగా ప్రగతి భవన్ వద్ద మెరుపు వేగంతో నిరసన తెలిపి, మాయమయ్యారు. ఈ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, కేసీఆర్ ఎక్కడ అంటూ ఏకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటికీ తెరదించుతూ... కేసీఆర్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు.