India: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు పరం కానున్న రైల్వే రూట్లివే... ఎయిర్ లైన్స్ తరహాలో సేవలు!

Praivatisation of Train Routes in Full Speed
షార్ట్స్‌లో చూడండి
దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడిపించేందుకు పచ్చజెండా ఊపిన కేంద్ర రైల్వే శాఖ, సికింద్రాబాద్ క్లస్టర్ లో పది రూట్లను ఎంపిక చేసింది. ఈ రూట్లలో విమానాల తరహాలో రైళ్లను నిర్వహించేందుకు మార్గాన్ని సుగమం చేస్తున్న కేంద్రం, ఆసక్తిగల సంస్థల నుంచి ఫైనాన్షియల్ బిడ్లను కూడా ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ మరో ఆరు నెలల్లో ప్రైవేటు రైళ్లను పరుగులు పెట్టించాలని భావిస్తోంది.

ఇక సికింద్రాబాద్ క్లస్టర్ లో నడిచే ప్రైవేటు రైళ్ల వివరాలు పరిశీలిస్తే, సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం, గుంటూరు, తిరుపతి, ముంబై, హౌరా మార్గాలు, విశాఖ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాలున్నాయి. వీటితో పాటు ముంబై - ఔరంగాబాద్ మార్గం కూడా సికింద్రాబాద్ క్లస్టర్ పరిధిలోనే ఉండనుంది.

కాగా, ప్రైవేటు రైళ్లను అనుమతించడాన్ని కార్మిక సంఘాలు మాత్రం గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ప్రైవేటు రైళ్లు వస్తే, లక్షలాది మంది రైల్వే ఉద్యోగులు, కార్మికులు తమ ఉపాధిని కోల్పోతారని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆరోపిస్తోంది. రైల్వేలను నిర్వీర్యం చేయడానికి కేంద్రం కంకణం కట్టుకుందని, దీన్ని అడ్డుకుంటామని యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకర్ రావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పేదల ప్రయాణ సాధనంగా ఉన్న రైల్వేలను ప్రైవేటీకరిస్తే, చార్జీల భారం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
India
Trains
Private
Secunderabad

More Telugu News