Telangana: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా మరణ మృదంగం.. నిన్న ఏడుగురి బలి!

  • 24 గంటల వ్యవధిలో 1,410 కేసుల నమోదు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 918 కేసులు
  • రాష్ట్రంలో 30 వేల మార్క్ దాటేసిన కరోనా కేసులు
Corona virus cases crossed 30 thousand mark in Telangana

తెలంగాణలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడి నిన్న ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, గత 24 గంటల్లో కొత్తగా 1,410 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా కేసుల సంఖ్య 30 వేల మార్కును దాటేసి 30,946గా నమోదు కాగా, మరణాల సంఖ్య 331కి పెరిగింది. నిన్న 913 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 12,423కి తగ్గింది. కరోనా మహమ్మారి వెలుగుచూసిన తర్వాత దాని బారినపడి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 18,192కు పెరిగింది.

నిన్న నమోదైన కేసుల్లో ఎప్పటిలానే జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 918 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో రంగారెడ్డి (125), సంగారెడ్డి (79), మేడ్చల్ (67), వరంగల్ అర్బన్ (34), కరీంనగర్ (32), భద్రాద్రి కొత్తగూడెం (23), నల్గొండ (21), నిజామాబాద్ (18) మెదక్ (17), ఖమ్మం (12) సూర్యాపేట (10) ఉన్నాయి. ఇక, పెద్దపల్లి, ఆదిలాబాద్, వికారాబాద్, జనగామ, ములుగు, వనపర్తి, సిద్ధిపేటలలో ఒక్కో కేసు నమోదైంది.
.

More Telugu News