ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. అందరూ పాస్!
- 1.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
- జూలై 31 తర్వాత మార్కుల మెమోల అందజేత
- సీఎం నిర్ణయంతో పరీక్షలను రద్దు చేశామన్న సబిత
వీరంతా కంపార్ట్ మెంట్ లో ఉత్తీర్ణులైనట్టు మార్కుల జాబితాలో పేర్కొంటామని సబిత ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. జూలై 31 తర్వాత సంబంధిత కాలేజీల నుంచి మార్కుల మెమోలను పొందవచ్చని తెలిపారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెమోలను 10 రోజుల తర్వాత అందిస్తామని చెప్పారు.