Corona Virus: దేశంలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు

Indias COVID19 case tally crosses 7 lakh mark with 22252 new cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 22,252 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది. అదే సమయంలో 467 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,19,665 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 20,160కి పెరిగింది. 2,59,557 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,39,948 మంది కోలుకున్నారు.
                              
నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,02,11,092 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,41,430 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News