విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో పురోగతి.. మరో ఆరుగురి అరెస్ట్
- విజయవాడలో సంచలనం సృష్టించిన సందీప్ హత్య
- ఈ కేసులో ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు
- ఐదు సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం
తాజాగా, మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పటమట తోటవారి వీధికి చెందిన పురం చైతన్య అలియాస్ బుడ్డి (26), కానూరు వసంత్‌నగర్‌కు చెందిన మాచర్ల సాగర్ (24), పటమట డొంక రోడ్డుకు చెందిన పులగం జూసి ప్రభుకాంత్ (29), యనమలకుదురు ఇందిరానగర్-1కు చెందిన కందుల అనిల్ కుమార్ (27), పటమట పోస్టల్ కాలనీకి చెందిన ఎర్రంశెట్టి ఆదిశేషు (21), పటమట రెల్లీస్ కాలనీకి చెందిన ముత్యాల కుమారస్వామి అలియాస్ చంబు (19) ఉన్నారు.