కేసీఆర్ ఫామ్ హౌస్ కు కూడా కరోనా వస్తుంది... ఇది నా శాపం: కోమటిరెడ్డి

05-07-2020 Sun 21:09
  • భగవంతుడు అన్నీ చూస్తుంటాడన్న కోమటిరెడ్డి
  • ప్రగతిభవన్ లో కేసులు వచ్చాయని ఫాంహౌస్ కు వెళ్లారంటూ వ్యాఖ్యలు
  • ప్రజల్ని చంపడానికి సీఎం అయ్యారా? అంటూ ధ్వజం
MP Komatireddy fires on CM KCR

తెలంగాణలో కరోనా పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ప్రగతిభవన్ లో కరోనా కేసులు వచ్చాయని ఫాంహౌస్ కు వెళ్లారంటూ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఏం, కరోనా అక్కడికి రాదా? అని ప్రశ్నించారు. పైన భగవంతుడు అన్నీ చూస్తుంటాడని, కేసీఆర్ ఫాం హౌస్ కు కూడా కరోనా వస్తుందని, ఇది తన శాపం అని అన్నారు. కరోనా కట్టడిలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యాయరని కోమటిరెడ్డి విమర్శించారు.

"ప్రజలను పాలించడానికి సీఎం అయ్యారా లేక చంపడానికి సీఎం అయ్యారా? పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షలకు పైగా టెస్టులు చేస్తే తెలంగాణలో లక్ష మాత్రమే ఎందుకు చేశారు? ఎక్కువ సంఖ్యలో టెస్టులు నిర్వహించకపోవడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువైంది. తెలంగాణలో ఇలాంటి సీఎం ఉండడం దురదృష్టకరం. కరోనా చికిత్స కోసం ఢిల్లీలో స్టార్ హోటళ్లను కూడా ఉపయోగిస్తున్నారు. ఏపీ, ఢిల్లీ ప్రభుత్వాలను చూసైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి. కరోనా చర్యల కోసం వసూలైన కోట్ల రూపాయల విరాళాలు ఏమయ్యాయి?" అంటూ ప్రశ్నించారు.