కాన్పూర్ కాల్పుల కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడి... నరరూపరాక్షసుల్లా ప్రవర్తించిన వికాస్ దూబే గ్యాంగ్
- డీఎస్పీ తల నరికివేత, కాలివేళ్ల కోసివేత
- ఓ ఎస్సై శరీరంపై బుల్లెట్ల వర్షం
- పోలీసుల తల భాగాల్లో అత్యధిక బుల్లెట్లు
ఓ ఎస్సై శరీరంలో తుపాకీలో ఉన్న బుల్లెట్లన్నీ దింపేశారు. మరో కానిస్టేబుల్ పైనా ఇదే రీతిలో బుల్లెట్ల వర్షం కురిపించారు. పోలీసుల నుంచి లాక్కున్న ఏకే-47 తుపాకీతో ఈ కాల్పులు జరిపారని తేలింది. బుల్లెట్ గాయాలతో పడివున్న పోలీసులను అత్యంత సమీపం నుంచి దారుణంగా కాల్చి చంపారు. బుల్లెట్ గాయాలన్నీ తల, భుజాలపైనే ఉన్నాయని పోస్టుమార్టం చేసిన డాక్టర్లు తెలిపారు. తల భాగంలోనే అత్యధిక సంఖ్యలో బుల్లెట్లు ఉండడం పట్ల డాక్టర్లు కూడా విస్మయానికి గురయ్యారు. దీనిపై కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ స్పందిస్తూ, ఈ తరహా చర్యలకు మావోయిస్టులు ఎక్కువగా పాల్పడుతుంటారని చెప్పారు.