Rave Party: బంజారాహిల్స్ లోని ఓ హోటల్లో రేవ్ పార్టీ... కేసు నమోదు

Police busted Rave Party at a star hotel in Hyderabad
  • ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • పోలీసుల అదుపులో నలుగురు యువకులు, నలుగురు యువతులు
  • అరెస్టయిన వారిలో ఉక్రెయిన్ యువతి
ఓవైపు కరోనా రక్కసి కరాళనృత్యం చేస్తున్న వేళ, హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ స్టార్ హోటల్లో రేవ్ పార్టీ జరగడం తీవ్ర కలకలం రేపింది. రేవ్ పార్టీపై సమాచారం అందుకున్న పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఇందులో నలుగురు యువకులు, నలుగురు యువతులు ఉన్నారు. వీరిలో ఒకరు ఉక్రెయిన్ జాతీయురాలు. కాగా, ఈ రేవ్ పార్టీ నిర్వహించిన వ్యక్తే గతంలో జూబ్లీహిల్స్ లోనూ ఓ రేవ్ పార్టీ నిర్వహించినట్టు తెలుస్తోంది. నిందితులపై కరోనా నిబంధనల ఉల్లంఘనల కేసు కూడా నమోదు చేసినట్టు సమాచారం.
Rave Party
Banjarahills
Police
Arrest

More Telugu News