Google: ఫేస్ బుక్ లాగిన్ వివరాలు తస్కరిస్తున్న 25 యాప్ లను నిషేధించిన గూగుల్

  • భద్రతలేని ఆండ్రాయిడ్ యాప్ లపై గూగుల్ కొరడా
  • మాల్వేర్ తో ఇన్ స్టాల్ అవుతున్న యాప్ లు
  • గూగుల్ ను అప్రమత్తం చేసిన ఎవినా
Google bans twenty five apps who steals login details from Facebook

సరైన భద్రత లేకుండా, యూజర్ల గోప్యతకు భంగం కలిగించే కొన్ని యాప్ లపై గూగుల్ కొరడా ఝుళిపించింది. ఫోన్లలో ఫేస్ బుక్ లాగిన్ వివరాలు, పాస్ వర్డ్ లను చోరీ చేస్తున్న 25 యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ లు ఓ మాల్వేర్ తో ఇన్ స్టాల్ అవుతున్నాయని, ఆ మాల్వేర్ ఫోన్ లో తిష్టవేసి ఫేస్ బుక్ లాగిన్ వివరాలను తస్కరిస్తోందని ఎవినా అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ గూగుల్ ను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలోనే గూగుల్ సదరు యాప్ లపై నిషేధం విధించింది. ఈ యాప్ లు ఫైల్ మేనేజర్స్, ఫ్లాష్ లైట్స్, వాల్ పేపర్ మేనేజ్ మెంట్, స్క్రీన్ షాట్ ఎడిటర్, వాతావరణం తదితర అంశాలకు చెందినవని ఎవినా పేర్కొంది.

More Telugu News