Telangana: తెలంగాణలో కరోనా పంజా.. ఒక్క రోజులోనే  ఏకంగా 1,850 కేసుల నమోదు!

Telangana registers 1850 new cases in a single day
  • తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క రోజులో 1,572 కొత్త కేసులు
  • రాష్ట్రంలో 22,312కి పెరిగిన కేసుల సంఖ్య
తెలంగాణలో కరోనా మహమ్మారి శర వేగంగా విస్తరిస్తోంది. ఈరోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఏకంగా 1,850 కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 1,572 కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 92, మేడ్చల్ జిల్లాలో 53 కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ లో 31, కరీంనగర్ లో 18, నిజామాబాద్ లో 17 మంది కరోనా బారిన పడ్డారు. ఈ రోజు ఐదుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,312కి పెరిగాయి. మొత్తం 288 మంది ప్రాణాలను కోల్పోయారు. ఆసుపత్రుల నుంచి ఈరోజు 1,342 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా, మొత్తం 10,537 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
Telangana
Corona Virus
Cases

More Telugu News