కరోనా వైరస్ జన్యుక్రమంలో మార్పులు.. మరింత పెరిగిన ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం
- సార్స్‌కోవ్-2లో మార్పులతో కొత్త రకం వైరస్
- ‘డీ614జీ’ని ఏప్రిల్ తొలి వారంలోనే గుర్తించిన శాస్త్రవేత్తలు
- వైరస్‌కు ఉన్న కొమ్ములాంటి ‘స్పైక్ ప్రొటీన్’లో మార్పు
నిజానికి దీనిని ఏప్రిల్ తొలి వారంలోనే గుర్తించినట్టు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ కొత్తరకం వైరస్ ప్రవేశిస్తే పరిస్థితి మొత్తం తారుమారు అవుతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన బెటో కోర్బర్ పేర్కొన్నారు. ఈ వైరస్‌లో మార్పు చిన్నదే అయినా అది చాలా సమర్థవంతమైనదని, వైరస్ పై పొరల్లో ఉండే కొమ్ములాంటి ‘స్పైక్ ప్రొటీన్’లో ఈ మార్పు జరిగినట్టు వివరించారు.