అనర్హత వేటు వేయకుండా అడ్డుకోండి.. హైకోర్టును ఆశ్రయించిన రఘురామ కృష్ణరాజు
- పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదన్న నరసాపురం ఎంపీ
- తాను ఎన్నికయింది ఓ పార్టీపై.. షోకాజ్ నోటీసు ఇచ్చింది మరో పార్టీ లెటర్ హెడ్‌పై
- ఈసీ నిర్ణయం తీసుకునే వరకు చర్యలు తీసుకోకుండా చూడాలంటూ పిటిషన్
పార్టీకి వ్యతిరేకంగా తాను ఎటువంటి చర్యలకు పాల్పడలేదని అన్నారు. తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని రఘురామ కృష్ణరాజు కోరారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.