India: భారత వెబ్ సైట్లను బ్లాక్ చేసిన చైనా ప్రభుత్వం

  • టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లపై భారత్ నిషేధం
  • భారత్ వెబ్ సైట్లను బ్లాక్ చేసేందుకు వీపీఎన్ ను అడ్డుకుంటున్న చైనా
  • టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్న చైనా
China blocks Indian websites by vpn server stoppage

టిక్ టాక్ వంటి ప్రముఖ చైనా యాప్ లను భారత కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే చైనా ఇప్పటికే భారత వెబ్ సైట్లను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అడ్డుకుంటున్న విషయం తాజాగా వెల్లడైంది. చైనాలో భారత వెబ్ సైట్లు చూసేందుకు వీల్లేకుండా అక్కడి ప్రభుత్వం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) సర్వర్ల వ్యవస్థను నిలిపివేసింది. అటు, భారత టీవీ చానళ్లు చూడాలంటే ఐపీ టీవీ ఒక్కటే మార్గమని బీజింగ్ లోని భారత దౌత్య వర్గాలంటున్నాయి. దీన్నిబట్టి అక్కడి కేబుల్ న్యూస్ వ్యవస్థలో భారత టీవీ చానళ్లను అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది.

చైనాలో వార్తా ప్రసారాలపైనా, ప్రసార సంస్థలపైనా విపరీతమైన సెన్సార్ ఉంటుంది. వీపీఎన్ వంటి నెట్వర్కింగ్ టూల్స్ లేకుండా వెబ్ సైట్లు వీక్షించడం కుదరనిపని. అందుకే చైనా తనకు అభ్యంతరకరం అని భావించిన వెబ్ సైట్లను, టీవీ చానళ్లను ఇంటర్నెట్లో చూసేందుకు వీల్లేకుండా వీపీఎన్ ను నిలువరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. ఈ టెక్నాలజీ పనితీరు చూస్తే అద్భుతం అనకుండా ఉండలేరు.

ఉదాహరణకు... చైనాకు హాంకాంగ్ నిరసనలు అంటే నచ్చని విషయం. బీజింగ్ లో ప్రసారమయ్యే సీఎన్ఎన్, బీబీసీ వంటి అంతర్జాతీయ చానళ్లలో 'హాంకాంగ్' అనే పదం రాగానే స్క్రీన్ మొత్తం బ్లాంక్ గా మారిపోతుంది. 'హాంకాంగ్' అనే పదానికి సంబంధించిన వార్తాంశం అయిపోయేంత వరకు స్క్రీన్ ఖాళీగా దర్శనమిస్తుంది. ఇలాంటి హైటెక్ ఆవిష్కరణలకు చైనా పెట్టిందిపేరు.

More Telugu News