BJP: కొవిడ్-19 బారిన హర్యానా బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సుధ

Haryana BJP MLA Subhash Sudha Infected to corona virus
షార్ట్స్‌లో చూడండి
ఈ నెల 21న సూర్యగ్రహణం రోజున నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న హర్యానాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సుధ కరోనా బారినపడ్డారు. కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్ ఎమ్మెల్యే అయిన సుభాష్ గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. వెంటనే అప్రమత్తమైన వైద్యులు ఆయన కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు.

సూర్యగ్రహణం రోజున ఎమ్మెల్యే పాల్గొన్న పూజా కార్యక్రమాలకు 200 మందికిపైగా హాజరయ్యారు. బహుశా అక్కడే ఆయనకు కరోనా వైరస్ సంక్రమించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, హర్యానాలో ఇప్పటి వరకు 13,829 కరోనా వైరస్ కేసులు వెలుగుచూశాయి. అలాగే, 223 మంది కొవిడ్ కారణంగా మృతిచెందారు.
Go Back to Shorts
BJP
Haryana
MLA Subhash Sudha
Corona Virus

More Telugu News