Lockdown: ముంబైలో కొత్త ఆంక్షలు.. రెండు కిలోమీటర్లు దాటి వెళ్లొద్దంటున్న పోలీసులు

  • ముంబైలో కొనసాగుతున్న కరోనా కేసుల ఉద్ధృతి
  • ఉద్యోగులు, అత్యవసర సేవల సిబ్బందికి మాత్రం సడలింపు
  • లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగిస్తున్నట్టు ప్రకటించిన సీఎం
No one should go beyond 2 kilometres in mumbai says police

ముంబైలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు సరికొత్త ఆంక్షలు అమలు చేస్తున్నారు. నగర వాసులు ఎవరూ తమ ఇంటి నుంచి రెండు కిలోమీటర్లు దాటి వెళ్లడానికి వీల్లేదని హెచ్చరికలు జారీ చేశారు.

అయితే, ఈ విషయంలో ఉద్యోగులు, అత్యవసర సేవల సిబ్బందిని మినహాయించారు. చాలామంది కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నట్టు గుర్తించిన అధికారులు.. ఇకపై ప్రజలెవరూ రెండు కిలోమీటర్ల పరిధిని దాటి వెళ్లడానికి వీల్లేదని పేర్కొన్నారు. వారేం చేసినా ఆ పరిధిలోనేనని స్పష్టం చేశారు.

వ్యాయామం, వాకింగ్ వంటి వాటిని కూడా రెండు కిలోమీటర్ల పరిధిలోనే చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ తప్పని సరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కేసుల తీవ్రత  పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిన్న ప్రకటించారు.

More Telugu News