Renu Desai: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Renu Deshai says she is not doing any film right now
  • ఆ వార్త నిజం కాదంటున్న రేణు 
  • 'అర్జున్ రెడ్డి' దర్శకుడి మరో చిత్రం
  • 'భారతీయుడు-2'లో యువ కథానాయిక
*  మహేశ్ బాబు నిర్మిస్తున్న సినిమాలో రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఈ వార్తలో ఏమాత్రం వాస్తవం లేదని రేణు వివరణ ఇచ్చారు. 'ఇది విని నేను ఆశ్చర్యపోయాను. అసలు అలాంటి ఆఫర్ ఏదీ నాకు రాలేదు. ఎవరో ఈ వార్తను పుట్టించారు' అంటూ చెప్పుకొచ్చారామె.
*  'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్' సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో ప్రవేశించి తొలిచిత్రంతోనే అక్కడ కూడా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 'డెవిల్' పేరుతో తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయమై ప్రస్తుతం రణబీర్ కపూర్ తో ఆయన సంప్రదింపులు జరుపుతున్నాడట.
*  కమలహాసన్, శంకర్ ల కాంబినేషన్ లో 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ ప్రధాన హీరోయిన్ గా నటిస్తుండగా, తాజాగా శ్రుతి శర్మను మరో హీరోయిన్ గా తీసుకున్నారట. ఆమధ్య తెలుగులో వచ్చిన 'ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రంలో శ్రుతి కథానాయికగా నటించింది.  
Renu Desai
Sandeep Reddy
Kamala Hassan
Kajal Agarwal

More Telugu News