వైన్ షాపులో పని చేస్తున్న వ్యక్తికి కరోనా.. బెంబేలెత్తుతున్న మందుబాబులు!
- నల్గొండ జిల్లాలో వైన్ షాపులో పని చేస్తున్న వ్యక్తికి కరోనా
- ఆ వైన్ షాప్ నుంచి 300 బెల్ట్ షాపులకు మద్యం సరఫరా
- ప్రైమరీ కాంటాక్ట్స్ పై ఆరా తీస్తున్న అధికారులు
తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడుతూనే అతను వైన్ షాపుకు వచ్చాడు. ఈ వైన్ షాపు నుంచి 300 బెల్టు షాపులకు మద్యం సరఫరా అవుతోంది. ఇప్పుడు ఇతనికి కరోనా అని నిర్ధారణ కావడంతో... ఆ వైన్ షాపులో పని చేస్తున్న వారికి, అక్కడ మందు కొనుగోలు చేసిన వ్యక్తులకు, అక్కడి నుంచి మద్యం తీసుకెళ్లిన బెల్డ్ షాపుల వారికి దడ పుడుతోంది. అధికారులు అతని ప్రైమరీ కాంటాక్ట్స్ పై ఆరా తీస్తున్నారు.