అచ్చెన్నాయుడు భార్య, కుమారులను పరామర్శించిన నారా లోకేశ్
- శ్రీకాకుళం జిల్లాలోని అచ్చెన్న ఇంటికి వెళ్లిన నారా లోకేశ్
- తామంతా అండగా ఉన్నామంటూ భరోసా ఇచ్చిన వైనం
- అరెస్ట్ చేసిన వైనాన్ని అడిగి తెలుసుకున్న లోకేశ్
ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు నివాసానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెళ్లారు. అచ్చెన్న భార్య మాధవి, కుమారులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, తామంతా అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. దీంతోపాటు పార్టీ నేతలతో మాట్లాడి అచ్చెన్నను పోలీసులు అరెస్ట్ చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు.