వేలానికి విప్లవవీరుడు చేగువేరా జన్మించిన ఇల్లు!
- అర్జెంటీనాలోని రోసారియో నగరంలో జన్మించిన చేగువేరా
- వైద్య విద్యను అభ్యసించి.. పోరాటాల వైపు మళ్లిన చే
- ప్రముఖ పర్యాటక ప్రదేశంగా ఉన్న చేగువేరా జన్మించిన ఇల్లు
అర్జెంటీనాలోని రోసారియో నగరంలో చేగువేరా జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆయన... ఆ తర్వాత విప్లవ పోరాటాల వైపు మళ్లారు. రోసారియోలో ఆయన జన్మించిన క్లాసికల్ బిల్డింగ్ ఇప్పుడు వేలానికి వచ్చింది. 2002లో నిర్వహించిన వేలంపాటలో ఈ భవనాన్ని ఫ్రాన్సిస్ కో ఫరుగియా అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. దీన్ని సాంస్కృతిక కేంద్రంగా చేయాలనుకున్నప్పటికీ కుదరకపోవడంతో... వేలం వేయాలని అనుకుంటున్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు, ఈ బిల్డింగ్ కు ఎంతో క్రేజ్ ఉంది. దీన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి ఎంతో మంది వస్తుంటారు.