Rajinikanth: రజనీ 'రోబో' అవతారం గుట్టును వెల్లడించిన సినిమాటోగ్రాఫ‌ర్

  • కంప్యూట‌ర్ గ్రాఫిక్స్ తో రూపొందించార‌నుకుంటోన్న ఫ్యాన్స్
  • 2008 నాటి ఫొటోను పోస్ట్ చేసి స్పష్టతనిచ్చిన సినిమాటోగ్రాఫ‌ర్
  • ఈ షూట్‌ కోసం రజనీకి సిల్వర్‌ పెయింట్‌ వేశారని వివరణ
This was a photoshoot  robo in 2008

రజనీకాంత్ నటించిన రోబో మూవీ సినీ అభిమానులను అమితంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో రోబోగా రజనీ కాంత్ లుక్‌ను అలా తీర్చిదిద్దడానికి ఎలా శ్రమించారన్న విషయంపై ఇప్పటివరకు ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. ఆయన లుక్‌ను కంప్యూట‌ర్ గ్రాఫిక్స్ సాయంతో రూపొందించార‌ని అభిమానులు భావించారు.

ఈ విషయంపై సినిమాటోగ్రాఫ‌ర్ రిచార్డ్ ఎమ్ న‌త‌న్ స్పష్టతనిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విట్ట‌ర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. 2008లో ఆ సినిమా ఫొటో షూట్‌లో తాను తీసిన స్టిల్‌ అంటూ ఆయన పేర్కొన్నారు.
                               
                 
ఈ లుక్ కోసం రజనీకి సిల్వర్‌ రంగు పెయింట్‌ వేశారని, ఇప్పటి వరకు విడుదల చేయని ఈ ఫొటోను చూడండంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా, శంకర్ దర్వకత్వంలో వచ్చిన రోబో సినిమా ప్రేక్షకులను అలరించగా, రోబో 2.ఓకు మాత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

More Telugu News