డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా రద్దు?... జగన్‌తో మంత్రి సురేశ్ కీలక భేటీ!

degree exams cancels in ap
కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉండడంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. పరీక్షలు లేకుండానే ఆ విద్యార్థులను పాస్ చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ విషయంపై సీఎం జగన్ నిర్వహిస్తోన్న సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో జరుగుతోన్న ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుని, అనంతరం దీనిపై మంత్రి సురేశ్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గని నేపథ్యంలో ఈ పరీక్షలనూ రద్దు చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Go Back to Shorts
exams
Andhra Pradesh
Jagan
Adimulapu Suresh

More Telugu News