లాక్ డౌన్ నిబంధనలు సడలించగానే... కొడుకుని తీసుకుని ఐస్ క్రీమ్ తినేందుకు వెళ్లిన కెనడా ప్రధాని ట్రుడావో!
- కరోనా నేపథ్యంలో లాక్ డౌన్
- ఇటీవలే నిబంధనల సడలింపు
- వెనీలా ఐస్ క్రీమ్ తిన్న ట్రుడావో
అక్కడ హడ్రియన్ వెనీలా ఐస్ క్రీమ్ ను కుకీ టాపింగ్ తో తీసుకోగా, ట్రుడావో తనకోసం వెనీలాను చాకొలెట్ లో ముంచి తీసుకున్నారు. ఇద్దరూ కలిసి బయటకు వచ్చి, తమ మాస్క్ లను తీసేసి ఐస్ క్రీమ్ కోన్ లను తింటూ కనిపించారని స్థానిక మీడియా వెల్లడించింది.
కాగా, కెనడాలో మార్చి మూడో వారం నుంచి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. అత్యవసర, నిత్యావసర వ్యాపార సముదాయాలు మినహా మిగతా వన్నీ మూసేశారు. ఇప్పుడు నిబంధనలను ఎత్తివేయడంతో, ప్రజలంతా తమతమ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు.