తన ఆరోగ్యం పట్ల బండ్ల గణేశ్ ట్వీట్

Bandla Ganesh says his health is fine
  • కరోనా వైరస్ బారిన పడ్డ బండ్ల గణేశ్
  • కంగారు పడుతున్న అభిమానులు
  • తన ఆరోగ్య పరిస్థితి బాగుందన్న గణేశ్
ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా సినీ రంగ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. గణేశ్ కు పౌల్ట్రీ వ్యాపారం ఉన్న సంగతి తెలిసిందే. షాద్ నగర్ లోని తన పౌల్ట్రీ ఫామ్ కు తరచు ఆయన వెళ్లొస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు కంగారు పడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో అభిమానుల ప్రశ్నలకు బండ్ల గణేశ్ ఓపికగా సమాధానమిస్తున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
Go Back to Shorts
Bandla Ganesh
Tollywood
Corona Virus
Health Condition

More Telugu News