Uttar Pradesh: లక్నోలో కార్ల దొంగల ముఠా అరెస్ట్... నిందితుల్లో వర్ధమాన సినీ నటుడు!

  • యూపీలో పట్టుబడిన భారీ ముఠా
  • 50కి పైగా లగ్జరీ వాహనాల స్వాధీనం 
  • వివరాలు వెల్లడించిన లక్నో సీపీ సుజిత్
Movie Artist in Car theft Gang

ఉత్తరప్రదేశ్ లో లగ్జరీ కార్ల దొంగతనాలు ఇటీవలి కాలంలో పెరిగిపోవడంతో, గట్టి నిఘా పెట్టిన పోలీసులు, ఓ పెద్ద ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి 50కి పైగా లగ్జరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా అరెస్టయిన వారిలో ఓ సినిమా నటుడు కూడా ఉండటంతో పోలీసు అధికారులు అవాక్కయ్యారు.

ఇతను మూడు చిత్రాల్లో నటించాడని, పైగా జర్నలిస్టుగా కూడా పనిచేస్తున్నాడని లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ తెలిపారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామన్నారు.

More Telugu News