ఇలా దిగజారి మాట్లాడే బదులు ఆత్మ విమర్శ చేసుకోండి: విజయసాయిరెడ్డి
Add ap7am to your home Screen

ఇలా దిగజారి మాట్లాడే బదులు ఆత్మ విమర్శ చేసుకోండి: విజయసాయిరెడ్డి

vijaya sai reddy fires on chandra babu naidu
  • రాజ్యసభ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనంటున్నారు
  • రాష్ట్రంలో ఎమర్జెన్సీ నడుస్తోందని అంటున్నారు
  • క్రిమినల్స్ రాజ్యసభకు వెళ్తున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు
  • మీ ఎమ్మెల్యేలే ఛీకొట్టి మీకు ఓటేయలేదని గ్రహించండి
టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'రాజ్యసభ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనంటూ కళా వెంకట్రావు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ నడుస్తోందని మరో పచ్చనేత. క్రిమినల్స్ రాజ్యసభకు వెళ్తున్నారంటూ సభా మర్యాదకు భంగం కలిగేలా ప్రేలాపన. ఇలా దిగజారి మాట్లాడే బదులు ఆత్మ విమర్శ చేసుకోండి. మీ ఎమ్మెల్యేలే ఛీకొట్టి మీకు ఓటేయలేదని గ్రహించండి' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
 
గత టీడీపీ పాలనపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'ఉద్యోగుల కష్టార్జితానికి చంద్రబాబు కన్నమేశారని కాగ్ తేల్చింది. 731 కోట్ల రూపాయల సీపీఎస్ డబ్బును బ్యాంకుకు జమ చేయలేదు. ఉద్యోగుల జీతాల నుంచి పది శాతం కొట్టేశాడు. ప్రత్యేక విమానాలకు, దొంగ దీక్షలకు దుబారా చేశాడు బాబు గారు' అని విజయసాయిరెడ్డి చెప్పారు.
Vijay Sai Reddy
YSRCP
Chandrababu

More Telugu News