Jagan: తమిళనాట వైఎస్ జగన్ పోస్టర్లు!

YS Jagan Posters in Tamilnadu Goes Viral
  • రేపు విజయ్ పుట్టిన రోజు
  • రాజకీయాల్లోకి రావాలంటున్న ఫ్యాన్స్
  • జగన్ లా ఘన విజయం సాధించాలని అభిలాష
తమిళనాడులో రజనీకాంత్ తరువాత అటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన విజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన పోస్టర్లు ఇప్పుడు ఏపీలో వైరల్ అవుతున్నాయి. విజయ్ ఫోటోతో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ చిత్రాలను ముద్రించి, ఈ పోస్టర్లను తయారు చేయించడమే వీటిని వైరల్ చేసింది. తమ హీరో విజయ్ ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్న ఫ్యాన్స్, ఆయన తండ్రి చంద్రశేఖర్ ఒత్తిడి పెంచుతున్నారు.

ఇక తమిళనాడులో వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, విజయ్ రాజకీయాల్లోకి వచ్చి యువనేత జగన్ మాదిరిగా ఘన విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. కాగా, రేపు విజయ్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతూ, 'రేపటి ప్రభుత్వాన్ని నిర్ణయించనున్న సర్కార్' అంటూ పోస్టర్లపై స్లోగన్స్ రాశారు. మధురై, కుంభకోణం తదితర ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నాయి.
Jagan
Tamilnadu
Actor Vijay
Posters

More Telugu News