yoga: యోగా డే.. ఆసనాలు వేసిన ప్రముఖులు.. ఫొటోలు ఇవిగో

yoga day special images
  • భౌతిక దూరం పాటిస్తూ యోగా 
  • ఆసనాలు వేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
  • ఇంట్లోనే బీజేపీ నేతలు, పలు రాష్ట్రాల సీఎంల ఆసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రముఖులు యోగసనాలు వేశారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అవసరంగా మారడంతో దాన్ని ప్రభావవంతంగా పెంచుకోవడంలో యోగా చక్కగా ఉపయోగపడుతుంది. యోగాతో రక్తప్రసరణ పెంచుకోవచ్చు. కరోనా వ్యాప్తి చెందుతుండడంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అందరూ ఇళ్ల వద్దే జరుపుకుంటున్నారు. భౌతిక దూరం పాటిస్తూ యోగా చేస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సైనికులు, క్రికెటర్లు యోగాసనాలు వేశారు.
       





                   
                     
yoga
Ram Nath Kovind
Venkaiah Naidu

More Telugu News