VH: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధరణ‌

vh tests positive for corona
  • ఇటీవల పలు ప్రాంతాల్లో పర్యటించిన వీహెచ్
  • 2 రోజులుగా అనారోగ్యం
  • హోం క్వారంటైన్‌లో ఆయన కుటుంబ సభ్యులు
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావుకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. లాక్‌డౌన్‌ సమయంలోనూ ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. 2 రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు చేయడంతో కరోనా ఉన్నట్లు తేలింది.

ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు చేసే అవకాశం ఉంది. ఆయన కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వీహెచ్‌ ఇటీవల ఎవరెవరిని కలిశారన్న విషయాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలకు కరోనా సోకింది.
VH
Congress
Telangana
Corona Virus

More Telugu News